![]() |
![]() |

సోషల్ మీడియాలో ఒకప్పుడు కుమార్ ఆంటీ డైలాగే ఎక్కడైనా సరే వినిపిస్తూ ఉండేది. "మీది మొత్తం 1000 " అని. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. అలా సోషల్ మీడియా స్టార్ నుంచి ఇప్పుడు మూవీస్ లో ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ లో చిన్న చిన్న పత్రాలు చేస్తూ ఇప్పుడు టాప్ స్టార్ మూవీస్ లో కూడా వచ్చిన రోల్స్ అన్నీ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు "పాంచాలి పంచభర్తృక" అనే మూవీలో ఈమె నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.
"నాకు నటన అంటే తెలీదు. అందుకే మూవీ ఆఫర్స్ వచ్చినా వద్దు అనుకున్నా. మ్యాడ్ 2 లో నాకు లడ్డు రోల్ కి మేనత్త క్యారెక్టర్ వచ్చింది. చేయను అని చెప్పాను. తర్వాత ఇంకో మూవీ వచ్చింది. సలాం సైనిక ఫస్ట్ సినిమా . తర్వాత ప్రదీప్ గారి మూవీలో కూడా అవకాశం వచ్చింది. ఐతే ఈ మూవీ టైములో యాక్సిడెంట్ అవడం వలన ఆపరేషన్ అయ్యింది దాంతో ఆ మూవీ రోల్ రిజెక్ట్ అయ్యింది. తర్వాత ఈ మూవీ ఆఫర్ వచ్చింది. అలాగే రాజశేఖర్ గారి సినిమాలోనూ ఇంకా శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ మూవీలో కూడా నటిస్తున్నాను. అలాగే నేను ఆఫర్ ఇస్తున్నాను. రెండు లివర్ లు ఎక్సట్రా కాదు ఈ మూవీ చూసొచ్చి ఆ టికెట్ నాకు చూపిస్తే రూ. 100 ఇస్తాను. ఈ మూవీ అందరూ చూసి సక్సెస్ చేయండి " అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కుమారి ఆంటీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో చిన్న రోల్ లో నటించారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించారు.
ఇక కుమార్ ఆంటీ స్పీచ్ ని విన్న నెటిజన్స్ అంతా కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు. "సూపర్ గా మాట్లాడారు. మీలో చాలా టాలెంట్ ఉంది మా. స్టేజి ఫియర్ లేకుండా చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్. ఎలాంటి జంకు లేకుండా చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నారు. " అంటూ ఆమెను అభినందిస్తున్నారు.
![]() |
![]() |